ఈ ప్రేమ కి వెల కట్ట గలవా..Price of this love

ఈ ప్రేమ కి వెల కట్ట గలవా ?
ఈ బహుమతికి ఖర్చు ఎంత???


చెప్పె వారి పైన శ్రద్ధ, ఆశక్తి కనబరుస్తు
అన్య విషయాలథొ ఆదమరువక
పక్కనె కూర్చుని మరొలొకంలొ విహరించకుంద
వినె విషయంలొ లీనం కావటానికి…. ఖర్చు ఎంత?

ఒక చిన్న అనురాగపు మాట ,
అభిమానం నిండిన ఆదరణ,
గెలుపులొ ప్రశంశకి(ఆనందానికి) … ఒటమిలొ ఒదార్పుకు
"నెనున్నాను" అనె భరొసా ఇవ్వటనికి…. ఖర్చు ఎంత?

మ్రుదుమధుర దరహసం,
వెనుథిరిగి చూస్కొవతనికి భయపెట్టని
మధురానుభవలను జ్ఞాపకాలుగా
బహుకరించటానికి….. ఖర్చు ఎంత??

తను చెసె ప్రతి పనిలొ
తన ప్రెమనీ, కష్టాన్ని గుర్తించిన
అనుభూతి తెలిపే ఒక చిన్న
ప్రశంశ మనఃపూర్వకంగా ఇవ్వటానికి…. ఖర్చు ఎంత???

తనతొ ఎంతసెపు గడ్దిపినా అది తక్కువె అనిపిస్తుందని
తనతొ గడిపె కాలం మనకు ఎంతొ అమూల్యమైనది అని తెలిసెలా
తనతొ గడ్దిపిన ఒక్క క్సనమైన సరె
తన ధ్యసతోనె, తన కోసమె గడపటానికి…. ఖర్చు ఎంత???

మన తీరిక సమయంలొ, లెదా వచ్చి-వెళ్ళే దారిలొ
చిన్ని చిన్ని పనులలొ మనం కూడ సహకరిస్తూ
తన బధ్యతని పంచుకొవటానికి, చేయూతనివ్వటానికి
మనం సిద్ధమే అని తెలుపటానికి… ఖర్చు ఎంత??

తనలొని మంచిని గుర్తించి గౌరవిస్తె,
థన సహకారానికి స్పందన తెలుపుతు
తన కృషికి, అశయాలకి, గెలుపుకి
నెను సమ్మతమే అని భరొసా తెలుపటానికి…. ఖర్చు ఎంత???

ఒక బంధానికి నమ్మకాన్ని అందించటానికి
ఖర్చు ఎంత???
పొనీ ఆ ఖర్చువల్ల ఆ బంధం పదిలంగా ఉంటుందంతె
లభనస్టాల లెక్కలు వెస్తె
తర్వత వచ్చె నస్టం విలువ ఎంత??? "ఒక జీవితం"